టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన క్రీడాకారుడు?
టోక్యో ఒలింపిక్స్–2020లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు.
ఆగస్టు 7న జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్.. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా నీరజ్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. గతంలో మిల్కా సింగ్ (1960 రోమ్), పీటీ ఉష (1984 లాస్ ఏంజెలిస్) నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాలను కోల్పోయారు. అభినవ్ బింద్రా (షూటింగ్– 2008 బీజింగ్) తర్వాత ఒలింపిక్స్ క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారుడిగా నీరజ్ గుర్తింపు పొందాడు. నీరజ్ తర్వాత జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 86.67 మీటర్లు), వితెస్లావ్ వెసిలీ(చెక్ రిపబ్లిక్; 85.44 మీటర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
నీరజ్ స్వర్ణ పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 7కు చేరింది. దీంతో 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలతో సాధించిన భారత అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించింది. హరియాణా రాష్ట్రం, పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామం నీరజ్ స్వస్థలం. వ్యవసాయ కుటుంబానికి చెందిన అతను ప్రస్తుతం భారత సైన్యంలో పనిచేస్తున్నాడు. నీరజ్‌కు జావెలిన్ త్రోలో వివిధ దశల్లో కోచ్‌లుగా వ్యవహరించిన గ్యారీ కాల్‌వర్ట్, యువ్ హాన్ అతడి ఆటను పైస్థాయికి తీసుకెళ్లగా, ప్రస్తుత కోచ్ క్లాస్ బార్టోనెట్జ్ అతన్ని చాంపియన్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు.
హరియాణా ప్రభుత్వం నజరానా రూ. 6 కోట్లు
హరియాణాకు చెందిన నీరజ్ చోప్రాకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ భారీ నజరానా ప్రకటించారు. హరియాణా క్రీడాపాలసీ ప్రకారం అతనికి రూ. 6 కోట్ల పారితోషికం, క్లాస్–1 ఉన్నతోద్యోగంతో పాటు నివాస స్థలం (నామమాత్రపు ధరతో) ఇస్తామని సీఎం తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్–2020లో భారత్‌కు స్వర్ణం అందించిన క్రీడాకారుడు?
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా
ఎక్కడ : టోక్యో, జపాన్
ఎందుకు : పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్.. ఈటెను అందరికన్నా ఎక్కువ దూరం(87.58 మీటర్లు) విసినందున...

#Tags