తెలంగాణకి పోషణ్ అభియాన్ అవార్డులు

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ అమల్లో తెలంగాణకు అవార్డులు లభించాయి.
జిల్లా స్థాయిలో లీడర్‌షిప్, కన్వర్జెన్స్‌లో సంగారెడ్డి జిల్లా, బ్లాక్ లెవల్‌లో ఇబ్రహీంపట్నంకు అవార్డులు దక్కాయి. ఢిల్లీలో ఆగస్టు 23న జరిగిన కార్యక్రమంలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అవార్డు అందుకున్నారు. బ్లాక్ లెవల్ అవార్డులను ప్రాజెక్టు అధికారి శాంతిశ్రీ అందుకున్నారు. వ్యక్తిగత విభాగాల్లో అంకిరెడ్డిపల్లెకు చెందిన అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ ఎంలు, ఏడబ్ల్యూహెచ్‌లు అందుకున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించి మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్‌ను అమలుచేస్తోంది.
#Tags