తెలంగాణ లోకాయుక్త చట్ట సవరణకు ఆర్డినెన్స్
లోకాయుక్త చైర్మన్, వైస్ చైర్మన్ల నియామకానికి సంబంధించిన అర్హతలను మార్చేందుకు తెలంగాణ లోకాయుక్త చట్టాన్ని అత్యవసరంగా సవరిస్తూ ఆర్డినెన్స్ తేవాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
మంత్రివర్గ భేటీలోని కీలక నిర్ణయాలు
- కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కొత్తగా మరో రూ.15,575.11 కోట్ల రుణాలు సమీకరించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం. కాళేశ్వరం నీటిపారుదల పథకం కార్పొరేషన్ పేరుతో నాబార్డు నుంచి రూ.1,500 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) నుంచి రూ.10 వేల కోట్లు, పీఎఫ్‌సీ నుంచే మరో రూ.4,075.11 కోట్ల రుణాలు తీసుకోవాలని నిర్ణయం.
- కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మిడ్‌మానేరు వరకు 3 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే వీలుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :తెలంగాణ లోకాయుక్త చట్ట సవరణకు ఆర్డినెన్స్
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం
ఎందుకు : లోకాయుక్త చైర్మన్, వైస్ చైర్మన్ల నియామకానికి సంబంధించిన అర్హతలను మార్చేందుకు
#Tags