సశస్త్ర సీమాబల్‌కు 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు

కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలకు చెందిన మిశ్రు ధాతు నిగమ్(మిధాని) లిమిటెడ్ 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను మార్చి 30న సశస్త్ర సీమాబల్‌కు అప్పగించింది.
ఈ సందర్భంగా మిధాని సీఎండీ డాక్టర్ దినేశ్ కుమార్ లిఖీ మాట్లాడుతూ... లైట్ వెయిట్ సాయుధ పదార్థంతో తయారు చేసిన ఈ వాహనాలు వినియోగానికి ఎంతో అనువుగా ఉంటాయన్నారు. వీటిని దేశ సరిహద్దుల్లో రక్షణ కోసం వినియోగిస్తారని చెప్పారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ కేంద్రంగా మిధాని పనిచేస్తోంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : సశస్త్ర సీమాబల్‌కు 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అప్పగింత
ఎప్పుడు : మార్చి
ఎవరు : మిశ్రు ధాతు నిగమ్(మిధాని) లిమిటెడ్
#Tags