సామాజిక మాధ్యమాలను వదిలేస్తా: ప్రధాని మోదీ

సామాజిక మాధ్యమాల్లో అనునిత్యం చురుగ్గా ఉండే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
2020, మార్చి 8 నుంచి ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌‌ట్రాగామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు మార్చి 2న  ట్విటర్ ద్వారా వెల్లడించారు. అరుుతే ఈ ఖాతాలను డిలీట్ చేయబోనని తెలిపారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలను సమాజంలో స్ఫూర్తి నింపిన మహిళలకు ఇచ్చేస్తానని మార్చి 3న మోదీ ప్రకటించారు. ఇలా చేయడం వల్ల కోట్లాదిమంది ప్రేరణ పొందుతారని అభిప్రాయపడ్డారు. ఎవరైనా తమ కథగానీ, తమకు తెలిసిన వారి కథగానీ సమాజంలో మార్పు తీసుకురాగలదని భావిస్తే #SheInspiresUs ట్యాగ్‌తో ఆ కథలను పంచుకోవాలని సూచించారు.
 
 5.33 కోట్లమంది ఫాలోవర్లు 
 ప్రధాని మోదీకి ట్విటర్‌లో 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోదీనే. ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది, ఇన్‌‌ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది అనుసరిస్తున్నారు. 2019 సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోదీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు.
#Tags