ఫ్రాన్స్ లో భారత రాయబారిగా జావెద్ అష్రాఫ్

ఫ్రాన్స్ లో భారత రాయబారిగా దౌత్యవేత్త జావెద్ అష్రాఫ్ నియమితులయ్యారు. 1991 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీసు అధికారి అయిన జావెద్ ఇంతవరకు సింగపూర్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేశారు.
ఫ్రాన్స్ లో భారత రాయబారిగా ఉన్న వినయ్ మోహన్ క్వత్రా నేపాల్ రాయబారిగా నియమితులయ్యారు.
 
 ఢిల్లీలో హింస ఆందోళనకరం
 ఢిల్లీలో చెలరేగిన హింసపై అమెరికాకు చెందిన కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వాల ప్రధాన బాధ్యత విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రజలకు భద్రత కల్పించడం, పూర్తి రక్షణ కల్పించడమేనని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సరికావని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్  పేర్కొన్నారు.
 
 సీఏఏపై బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ
 భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రభావంపై బ్రిటన్ పార్లమెంట్‌లోని ఎగువ సభ(హౌస్ ఆఫ్ లార్డ్స్)లో చర్చ జరిగింది. ఈ చట్టం అమలు, మైనారిటీల హక్కులపై ఆందోళనను వివరించేందుకు భారత్‌కు ప్రతినిధి వర్గాన్ని పంపాలని కోరింది.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి
 : భారత రాయబారిగా నియామకం
 ఎప్పుడు  : ఫిబ్రవరి 26
 ఎవరు  : జావెద్ అష్రాఫ్
 ఎక్కడ  : ఫ్రాన్స్







#Tags