పుజారాతో ఒప్పందం రద్దు: ఇంగ్లండ్ కౌంటీ జట్టు
భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లౌసెష్టర్‌షైర్ రద్దు చేసుకుంది.
ఈ మేరకు ఏప్రిల్ 9న ఆ జట్టు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం అతను ఏప్రిల్ 12–మే 22 మధ్య నాలుగు రోజుల పాటు సాగే 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ (కోవిడ్–19) విజృంభణతో ప్రస్తుతం ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉండటంతో అన్ని స్పోర్ట్స్ ఈవెంట్‌లు వాయిదా పడ్డాయి. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ దేశంలో మే 28 వరకు జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో పుజారాతో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించలేమని... అందుకే రద్దు చేస్తున్నట్లు గ్లౌసెష్టర్‌షైర్ పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాతో ఒప్పందం రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లౌసెష్టర్‌షైర్
ఎందుకు : కరోనా వైరస్ (కోవిడ్–19) విజృంభణతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాతో ఒప్పందం రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లౌసెష్టర్‌షైర్
ఎందుకు : కరోనా వైరస్ (కోవిడ్–19) విజృంభణతో
#Tags