నౌకాదళంలో తొలి మహిళా పైలట్‌గా శివాంగి

భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్‌గా లెఫ్టినెంట్ శివాంగి రికార్డు నెలకొల్పనున్నారు.
ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకొన్న ఆమె 2019, డిసెంబర్ 2న కేరళలోని కోచిలో విధుల్లో చేరనున్నారు. నౌకాదళంలోని డోర్నియర్ విమానాలను శివాంగి నడపనున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన శివాంగి స్థానిక డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసింది. ఎజిమాలోని ఇండియన్ నేవల్ అకాడమీలో 27 ఎన్‌ఓసీ కోర్సు చేసింది. నేవీలో ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్‌ను నియంత్రించే అధికారులుగా, కమ్యూనికేషన్స్, ఆయుధాలను పర్యవేక్షించే విభాగాల్లో మహిళలు పని చేస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్‌గా రికార్డు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : లెఫ్టినెంట్ శివాంగి
ఎక్కడ : కోచి, కేరళ




#Tags