మహిళా రక్షణ-రోడ్డు భద్రత ఏడాదిగా 2020

తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు, పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.
జనవరి 3న డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... 2020 సంవత్సరాన్ని మహిళా రక్షణ-రోడ్డు భద్రత సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఈచ్ వన్-టీచ్ వన్’కార్యక్రమంలో పోలీసు శాఖ పాల్గొంటుందన్నారు. ఒక్కొక్క పోలీసు యూనిట్ కనీసం తమ పరిధిలోని 20 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మహిళా రక్షణ-రోడ్డు భద్రత ఏడాదిగా 2020
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : మహిళలు, పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు

మాదిరి ప్రశ్నలు










#Tags