ఖాకీ బతుకులు నవలను రచించిన రచయిత?

స్పార్టకస్ కలం పేరుతో పోలీస్ వ్యవస్థలోని మరో కోణాన్ని ‘ఖాకీ బతుకులు’ నవలగా చిత్రీకరించి సాహితీలోకంలో, పోలీస్శాఖలో సంచలనం రేపిన విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ గంటినపాటి మోహనరావు(68) కన్నుమూశారు.
గుంటూరు జిల్లా తెనాలి పోలీస్‌ క్వార్టర్స్‌లోని నివాసంలో మార్చి 21న ఆయన తుదిశ్వాస విడిచారు. తెనాలిలో ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న 1980–83 మధ్యకాలంలో మోహనరావు ‘ఖాకీ బతుకులు’ నవల రాశారు. 1940–75 మధ్య పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసిన తన తండ్రి ప్రకాశం జీవితానుభవాలతో రాసిన ఈ నవల, 1996లో పుస్తకరూపం దాల్చింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఖాకీ బతుకులు నవలను రచించిన రచయిత కన్నుమూత
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : గంటినపాటి మోహనరావు(68)
ఎక్కడ : తెనాలి, గుంటూరు జిల్లా





#Tags