క్యూ3లో రిలయన్స్ 10 వేల కోట్ల లాభాలు ప్రకటన

2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.10,251 కోట్ల లాభాలను ప్రకటించింది.
క్యూ3లో నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ.10,251 కోట్ల లాభాలను పొందినట్టు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ముకేశ్ అంబానీ జనవరి 17న వెల్లడించారు. దీంతో ఒక త్రైమాసికంలో రూ. 10,000 కోట్ల పైగా లాభం నమోదు చేసిన తొలి భారతీయ ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది.

ఇప్పటిదాక ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మాత్రమే ఒక క్వార్టర్‌లో రూ.10 వేల కోట్లకు మించి లాభాలు ప్రకటించింది. 2013 జనవరి-మార్చి త్రైమాసికంలో ఐవోసీ రూ.14,513 కోట్ల నికర లాభం నమోదు చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2018-19 క్యూ3లో 10 వేల కోట్ల లాభాలు ప్రకటన
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్



#Tags