కొలువుదీరిన తెలంగాణ కొత్త హైకోర్టు

తెలంగాణ కొత్త హైకోర్టు జనవరి 1న కొలువుదీరింది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు.
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్‌తో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమం అనంతరం హైకోర్టులో తన సహచర న్యాయమూర్తులు 12 మందితో రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయడం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి : కొలువుదీరిన తెలంగాణ కొత్త హైకోర్టు
ఎప్పుడు : జనవరి 1
ఎక్కడ : హైదరాబాద్
#Tags