కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం

ఢిల్లీ పర్యటన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు ఆగస్టు 7న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడులను మర్యాద పూర్వకంగా కలిశారు.
అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమై రాష్ట్రానికి అండగా నిలవాలని కోరారు. మొదటగా హోమంత్రి అమిత్ షాను జగన్ కలిసారు. హామీలను నెరవేర్చాలని, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలవాలని ఆయనను అభ్యర్థించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ జగన్ భేటీ అయ్యారు. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు భారీ కార్యక్రమాలను చేపట్టామని మంత్రికి ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఆయా కార్యక్రమాలకు సాయం చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు భర్తీతోపాటు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి ఉదారంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త రహదారుల నిర్మాణం, నిర్వహణకు చేయూతనివ్వాలని, అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి పూర్తిస్థాయిలో కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని నితిన్ గడ్కరీని కోరారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ




#Tags