జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే కన్నుమూత

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (95) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో సెప్టెంబర్ 6న తుదిశ్వాస విడిచారు.
1924, ఫిబ్రవరి 21న బ్రిటిష్ పాలనలోని రొడీషియా(ప్రస్తుత జింబాబ్వే)లో ముగాబే జన్మించారు. 1960లో జింబాంబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జానూ) పార్టీని స్థాపించారు. స్వాతంతా్ర్యనంతరం జరిగిన జింబాబ్వే తొలి ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 1980లో తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1987 నుంచి 2017 వరకు దేశ అధ్యక్ష హోదాలో కొనసాగారు. జింబాబ్వే జాతిపితగా, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడిగా ముగాబే పేరొందారు. ముగాబే మూడు దశాబ్ధాల సుదీర్ఘ పాలనకు 2017 నవంబర్‌లో సైనిక తిరుగుబాటు ద్వారా తెరపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమర్సన్ మగగ్వా ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : రాబర్ట్ ముగాబే (95)
ఎందుకు : వయోభారం, అనారోగ్యం కారణంగా




#Tags