హరియాణాలో సంకీర్ణ ప్రభుత్వం
హరియాణాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. అక్టోబర్ 24న వెల్లడైన హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ రాజకీయ పార్టీ సాధించలేకపోయింది.
మొత్తం 90 సీట్లున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీ 40, కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకున్నాయి. మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన జేజేపీ 10 సీట్లలో, స్వతంత్ర అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. వీటిని బట్టి, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు దుష్యంత్ చౌతాలాతో పాటు, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్లు కానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై సుమారు 45 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
హరియాణా ఎన్నికల ఫలితాలు
హరియాణా ఎన్నికల ఫలితాలు
- మొత్తం స్థానాలు 90
- కావాల్సిన మెజారిటీ 46
పార్టీ | 2019 | 2014 | మార్పు |
బీజేపీ | 40 | 47 | -7 |
కాంగ్రెస్ | 31 | 15 | +16 |
ఐఎన్‌ఎల్‌డీ | 1 | 20 | -19 |
జేజేపీ | 10 | 0 | +10 |
స్వతంత్రులు | 7 | 5 | +2 |
హెచ్‌ఎల్పీ | 1 | 0 | +1 |
ఇతరులు | 0 | 3 | -3 |
#Tags