ఏపీలోని ఏ జిల్లాలో అపాచీ లెదర్ పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది?
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో అపాచీ ఇంటెలిజెంట్ సెజ్ లెదర్ పరిశ్రమ యూనిట్ ఏర్పాటు కానుంది.
ఈ యూనిట్ ఏర్పాటుకు డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడారు.
సీఎం ప్రసంగం...
- పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఏపీలో సంస్కరణల అమలు పట్ల పరిశ్రమలు స్థాపించిన పారిశ్రామిక వేత్తలు వంద శాతం సంతృప్తిగా ఉన్నారు. భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
- తైవాన్‌కు చెందిన అపాచీ అదిదాస్ సంస్థ చైనా, వియత్నాంతోపాటు దేశంలోని ఏపీలో పెట్టుబడులు పెట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అపాచీ ఇంటెలిజెంట్ సెజ్ లెదర్ పరిశ్రమ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పులివెందుల, వైఎస్సార్ కడప జిల్లా
#Tags