ఏపీలో సచివాలయాల ద్వారా 237 సేవలు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 237 సేవలను అందించనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 11న వెల్లడించారు.
ఇందులో 72 గంటల్లోనే 115 సేవలు ప్రజలకు అందించనున్నామని, మిగతా 122 సేవలను ఎప్పటిలోగా అందించగలమో వర్గీకరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్ సెంటర్‌ను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. 2019, అక్టోబర్ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
జాబ్ చార్టు ఆవిష్కరణ
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ప్రజల మధ్యే చర్చ జరిపేందుకు ఇక గ్రామాల్లో ప్రతి ఏటా తప్పనిసరిగా 8 విడతలుగా గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ సచివాలయ విధులు, సచివాలయ ఉద్యోగులు బాధ్యతలను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్టు పుస్తకాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయం మొత్తం చేపట్టాల్సిన విధులతో పాటు అందులో పనిచేసే ఒక్కో రకమైన ఉద్యోగికి ఒక్కో రకం జాబ్ చార్టును విడుదల చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 237 సేవలు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

#Tags