ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రం?

స్థానిక నిరుద్యోగ యువతకు రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘‘హరియాణా స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌ బిల్లు – 2020’’ హరియాణా గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య ఆమోదం తెలిపారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మార్చి 2న వెల్లడించారు. త్వరలో దీన్ని నోటిఫై చేస్తామన్నారు. ఈ బిల్లును హరియాణా అసెంబ్లీ గత సంవత్సరం ఆమోదం తెలిపింది. బిల్లు ప్రకారం... రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థల్లో నెలవారీ వేతనం రూ. 50 వేల లోపు ఉన్న ఉద్యోగాల్లో స్థానికులకు పదేళ్ల పాటు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : హరియాణా స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌ బిల్లు – 2020కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : హరియాణా గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య
ఎందుకు : స్థానిక నిరుద్యోగ యువతకు రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు






#Tags