ఎంఎస్‌ఎంఈల కోసం ఇండియన్‌ బ్యాంక్‌ తీసుకొచ్చిన కార్యక్రమం?

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ల కోసం ఇండియన్‌ బ్యాంక్‌ తీసుకొచ్చిన ‘ప్రేరణ’కార్యక్రమం ప్రారంభమైంది.
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు జూలై 6న హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి అండగా దేశవ్యాప్తంగా ‘ప్రేరణ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా అత్యంత సులువుగా రుణాలివ్వడంతోపాటు పరిశ్రమల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్‌ సీఈఓ, ఎండీ పద్మజా చెప్పారు. ఇండియన్‌ బ్యాంకుతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్‌ భగీరథ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కలిగి ఉంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఇండియన్‌ బ్యాంక్‌ తీసుకొచ్చిన ‘ప్రేరణ’ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జూలై 6
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : హైదరాబాద్‌
ఎందుకు : ఎంఎస్‌ఎంఈలకు అత్యంత సులువుగా రుణాలివ్వడంతోపాటు పరిశ్రమల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు...







#Tags