ఎమ్మెల్సీగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
ఉద్ధవ్‌కు శాసనసభ, శాసనమండలిలో సభ్యత్వం లేకపోవడంతో ఏప్రిల్ 9న కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న సీటును నుంచి సీఎం ఉద్ధవ్‌ను నియమించాలని గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీని కోరినట్టు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అనిల్ పరబ్ వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఎవరైనా మంత్రి ఆరు నెలల్లోగా ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యుడు కాలేపోతే ఆ పదవికి అనర్హుడవుతారు. 2019, నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ బాధ్యతలు చేపట్టారు. 2020, మే 28 నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : మహారాష్ట్ర కేబినెట్
ఎందుకు : ఉద్ధవ్‌కు శాసనసభ, శాసనమండలిలో సభ్యత్వం లేకపోవడంతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : మహారాష్ట్ర కేబినెట్
ఎందుకు : ఉద్ధవ్‌కు శాసనసభ, శాసనమండలిలో సభ్యత్వం లేకపోవడంతో
#Tags