Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 11th కరెంట్ అఫైర్స్
Nitish Kumar : బిహార్ సీఎంగా 8వ సారి..
బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి జనతాదళ్ (యునైటెడ్) నేత నితీశ్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 10న రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. మహా ఘట్‌బంధన్‌కు సారథ్యం వహిస్తున్న కీలక భాగస్వామ్య పార్టీ అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా వెనువెంటనే ప్రమాణం చేశారు. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also read: Ruchira Kamboj: ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా తొలి మహిళ
243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి 79 మంది, జేడీ(యూ)కు 43 మంది ఎమ్మెల్యేలుండగా కాంగ్రెస్‌కు 19 మంది ఉన్నారు.
2014 ఇప్పుడు గతం..
ఎన్డీఏ సంకీర్ణానికి నితీశ్ ఆగస్టు 9న గుడ్‌బై చెప్పారు. సీఎం పదవికి రాజీనామా చేశారు. తద్వారా బీజేపీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహా ఘట్‌బంధన్‌లో చేరి మర్నాడే మరోసారి సీఎం అయ్యారు.
Also read: Twin Towersను సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా Justice Lalit
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఆగస్టు 10న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తదుపరి సీజేఐగా జస్టిస్ యు.యు.లలిత్‌ను నియమించాలంటూ ఆగస్టు 4న సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ సిఫార్సు చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ పదవీ కాలం ఆగస్టు 26న ముగియనుంది. నూతన సీజేఐగా జస్టిస్ యు.యు.లలిత్ ఆగస్టు 27న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఏడాది నవంబరు 8న పదవీ విరమణ చేస్తారు. సీజే పదవీ బాధ్యతల్లో 74 రోజులు ఉంటారు.
Also read: Shweta Singh: పీఎంవో డైరెక్టర్‌గా శ్వేతా సింగ్
1957 నవంబరు 9న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించిన జస్టిస్ యు.యు.లలిత్ 1983లో మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
చైనాలో మరో కొత్త వైరస్ Langya
చైనాలో కరోనా వైరస్ బట్టబయలైన మూడేళ్ల తర్వాత మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లో ఇప్పటివరకు 35 మందికి ఈ వైరస్ సోకి అనారోగ్యం బారినపడడం ఆందోళన పుట్టిస్తోంది. జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే ఈ వైరస్‌ని లాంగ్యా హెనిపావైరస్ ( Lay– V) అని పిలుస్తున్నారు. ఈ వైరస్‌కి చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులో లేవు. లక్షణాల ఆధారంగా మందులు ఇస్తున్నారు. తూర్పు చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ ప్రావిన్స్‌లో జంతువులతో అధికంగా సావాసం చేసే రైతుల్లో కొందరికి జ్వరం సోకడంతో స్వాబ్ పరీక్షలు నిర్వహించగా ఈ వైరస్ సోకినట్టు వెల్లడైంది.
Also read: Most Distant Star ఎరెండల్
నిఫా, హెండ్రా వంటి ప్రాణాంతక వైరస్‌ల కుటుంబానికి చెందినదే ఈ వైరస్ అని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వైరస్‌ని బయోసేఫ్టీ లెవల్ 4 (బీఎస్‌ఎల్’)గా గుర్తించారు. ఈ వైరస్ సోకితే 40–75% వరకు మరణాలు సంభవిస్తాయి. ఈ వైరస్‌ని 2018లో గుర్తించారు. ఇంట్లో పెంచుకునే మేకల్లో 2 శాతం, కుక్కల్లో 5 శాతం జీవులు ఇప్పటికే ఈ వైరస్ బారినపడ్డాయి. మనుషుల్లో ఈ కేసులు ఇప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇది మనుషుల నుంచి మనుషులకి వ్యాపిస్తుందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.
Also read: Monkey Pox : త్వరలో టీకా
లక్షణాలు ఇవీ..
జ్వరం, దగ్గు, అలసట, వికారం, తలనొప్పి, వాంతులు, ఆకలి మందగించడం వంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో 35శాతం మందికి ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవడం, 54% మందిలో/ రోగనిరోధక శక్తికి మూలమైన వైట్ బ్లడ్ కౌంట్ (డబ్ల్యూబీసీ)లో తగ్గిపోవడం, కాలేయానికి సంబంధించిన సమస్యలు 35% మంది, కిడ్నీకి సంబంధించిన సమస్యలు 8% మందిలో వచ్చినట్టుగా గుర్తించినట్టు ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్ ప్రచురించింది.
Also read: E-bandage: గాయాలను మాన్పే ఈ–బ్యాండేజ్‌ల అభివృద్ధి
Covid Booster Dose గా కోర్బావ్యాక్స్
కోవిషీల్డ్, కోవాగ్జిన్ కోవిడ్ టీకాలు తీసుకున్న వ్యక్తులు బూస్టర్ డోసుగా బయోలాజికల్–ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోర్బావ్యాక్స్ వ్యాక్సిన్ వేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. ఇప్పటివరకు ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నామో బూస్టర్ డోసుగా అదే కంపెనీ వ్యాక్సిన్ బూస్టర్ వేసుకోవాలని చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా వేరే కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చింది. కోవిడ్–19పై నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టీఏజీఐ) సిఫార్స్ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆగస్టు 10న ఈ అనుమతులు మంజూరు చేసింది. కోవిషీల్డ్ లేదంటే కోవాగ్జిన్ తీసుకున్న ఆరు నెలలు లేదంటే 26 వారాల తర్వాత కోర్బావ్యాక్స్‌ను 18 ఏళ్లకు పైబడిన వారు బూస్టర్ డోసుగా వేసుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Also read: Quiz of The Day (August 11, 2022): ఆంధ్ర ప్రదేశ్‌లో లైలా తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
Srilanka లో సద్దుమణిగిన నిరసనలు
శ్రీలంకలో చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి కారకులైన రాజపక్స కుటుంబ పాలనపై ఆగ్రహంతో వెల్లువెత్తిన దేశవ్యాప్త నిరసనలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. రాజధానితో పాటు పలుచోట్ల ఏర్పాటైన నిరసన శిబిరాలను ఆందోళనకారులు ఆగస్టు 9 నాటికి పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో 123 రోజుల ఆందోళనలకు తాత్కాలికంగా తెర పడ్డట్టయింది. మరోవైపు, నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం ఆగస్టు 10న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే స్వతంత్ర ఎన్నికల సంఘం సభ్యులు, అవినీతి విచారణ అధికారులు, పోలీస్ తదితర ఉన్నతోద్యోగుల నియామకాధికారం అధ్యక్షుడి నుంచి రాజ్యాంగ మండలికి దఖలు పడుతుంది.
Also read: 75th Year of Independence Day of India: జెండా ఊంచా రహే హమారా!
ED HYD అడిషనల్ డైరెక్టర్ గా దినేష్ పరుచూరి
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ విభాగం అడిషనల్ డైరెక్టర్‌గా దినేష్ పరుచూరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈడీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్ గోయల్‌ను ముంబైకి బదిలీ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆగస్టు 10న ఉత్త ర్వులు జారీ చేసింది. ఆదాయ పన్నుల శాఖకు చెందిన దినేష్ పరుచూరి జూలై 31న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌కు డిప్యుటేషన్‌పై రాగా.. ఆయనను హైదరాబాద్‌లో అడిషనల్ డైరెక్టర్ గా నియమించారు. అభిషేక్ గోయల్‌ను ముంబై జోన్–2కు బదిలీ చేసి పనాజీ, రాయ్ పూర్ జోన్‌ల అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. కాగా ప్రస్తుతం ముంబై జోన్–2లో ఉన్న అడిషనల్ డైరెక్టర్ యోగేష్ శర్మను ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఇంటెలి జెన్స్ విభాగంలో నియమించారు.
Also read: Nepal Cricket హెడ్ కోచ్‌గా ప్రభాకర్
Common Wealth Fencing లో భవానికి స్వర్ణం
ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఇప్పుడు అక్కడే కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ జరుగుతుండగా ఇందులోనూ భారత ఫెన్సర్ సత్తా చాటింది. చెన్నైకి చెందిన భవానీ దేవి అద్భుత ప్రదర్శనతో స్వర్ణం నిలబెట్టుకుంది. టైటిల్ నిలబెట్టుకునే క్రమంలో 42వ ర్యాంకర్ భవాని 15–10తో రెండో సీడ్ వెరొనికా వాసిలెవా (ఆ్రస్టేలియా)ను కంగుతినిపించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా ఘనత వహించిన ఆమె పసిడి పోరులో చక్కని ప్రతిభ కనబరిచింది.
Also read: Chess Olympiod : భారత జట్లకు కాంస్య పతకాలు
Digital Loans : ఆర్బీఐ నిబంధనలు కఠినతరం
డిజిటల్‌గా రుణాల మంజూరుకు సంబంధించి నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేసింది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక వసూళ్ల విధానాలకు చెక్ పెట్టే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల కింద.. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు/ఆర్‌ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ముఖ్యంగా థర్డ్ పార్టీ సంస్థల అగడాలను అరికట్టడానికి ఆర్‌బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. రుణ ఉత్పత్తులను అడ్డగోలుగా మార్కెటింగ్ చేయడం, డేటా గోప్యతను ఉల్లంఘించడం, అనైతిక వ్యాపార విధానాలు, భారీ వడ్డీ రేట్లు, అనైతిక వసూళ్ల విధానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలన్నది ఆర్‌బీఐ కార్యాచరణగా ఉంది.
Also read: Government e - Marketplace లోకి సహకార సంఘాలు
నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలు..
- రుణ ఒప్పందానికి ముందు రుణ గ్రహీతకు కీలకమైన వాస్తవ సమాచార స్టేట్‌మెంట్ (కేఎఫ్‌ఎస్) ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్ధేశించింది. ఆర్‌బీఐ నియంత్రణల కింద పనిచేసే సంస్థలు, డిజిటల్ లెండింగ్ యాప్‌లు, వీటి కింద పనిచేసే రుణ సేవల సంస్థలు (థర్డ్‌పార్టీ) దీన్ని తప్పక పాటించాలి.
- రుణ గ్రహీత ఆమోదం లేకుండా ఆటోమేటిక్‌గా రుణ పరిమితి పెంచడాన్ని నిషేధించింది.
- డిజిటల్ రుణాలను అసలుతోపాటు, అప్పటి వరకు వడ్డీతో చెల్లించి (ఎటువంటి పెనాల్టీ లేకుండా) క్లోజ్ చేసేందుకు వీలుగా కూలింగ్ ఆఫ్/ లుక్ అప్ పీరియడ్‌ను కల్పించాలి.
- రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపకపోతే.. అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.
- డిజిటల్ లెండింగ్ యాప్‌లు, రుణ సేవల సంస్థలు రుణ గ్రహీత అనుమతితో, కావాల్సిన వివరాలను మాత్రమే తీసుకోవాలి. డేటా వినియోగంపై రుణ గ్రహీత అనుమతి తీసుకోవాలి.
- ఫిన్‌టెక్, డిజిటల్ లెండింగ్ సేవలపై ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా నియంత్రిత సంస్థలు, వాటి కింద రుణ సేవలను అందించే సంస్థలు తగిన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా అందించే రుణాలను డిజిటల్ లెండింగ్‌గా పరిగణిస్తారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP