చైనా, భారత్ ఏడో విడత మిలటరీ చర్చలు

తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ఇరుదేశాల మిలటరీ అధికారుల మధ్య తూర్పు లద్దాఖ్‌లోని చూశుల్ సెక్టార్‌లో అక్టోబర్ 12న ఏడో విడత చర్చలు జరిగాయి.
ఈ చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని రెండు దేశాలు అక్టోబర్ 13న ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. బలగాల ఉపసంహరణపై లోతైన, నిజాయితీతో కూడిన చర్చ జరిగిందని పేర్కొన్నాయి. అయితే, ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఈ చర్చల్లో ఎటువంటి కచ్చితమైన సానుకూల ఫలితం మాత్రం వెలువడలేదు.

12 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో భారత ప్రతినిధులకు 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరిందర్ సింగ్, చైనా ప్రతినిధులకు దక్షిణ జిన్‌జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ మేజర్ జనరల్ లియూ లిన్ సారథ్యం వహించారు.

లద్దాఖ్’ను అంగీకరించం
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా గుర్తించబోదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లు భారత్‌లో అంతర్భాగమని, వాటి గురించి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఇప్పటికే పలుమార్లు భారత్, చైనాను హెచ్చరించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : చైనా, భారత్ ఏడో విడత మిలటరీ చర్చలు
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : లెఫ్ట్‌నెంట్ జనరల్ హరిందర్ సింగ్, మేజర్ జనరల్ లియూ లిన్
ఎక్కడ : చూశుల్ సెక్టార్, తూర్పు లద్దాఖ్, భారత్
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం
#Tags