భారత వృద్ధి రేటు 7.5 శాతం : ఐఎంఎఫ్

2019లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.5 శాతం, 2020లో 7.7 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది.
తద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశంగా నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ జనవరి 21న నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2019, 2020ల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.5, 3.6 శాతాలుగా ఉంటాయి. ఈ రెండు సంవత్సరాల్లో చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.5 శాతం
ఎప్పుడు : 2019
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)



#Tags