ఆసియా చెస్ చాంపియన్‌షిప్‌లో సంధ్యకు స్వర్ణం

ఆసియా అమెచ్యూర్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజయవాడకి చెందిన గోలి సంధ్య స్వర్ణ పతకం సాధించింది.
థాయ్‌లాండ్‌లో జనవరి 5న జరిగిన మహిళల విభాగంలో నిర్ణీత తొమ్మిది రౌండ్లకుగాను సంధ్య ఆరు పాయింట్లు సాధించింది. ఈ చాంపియన్‌షిప్‌లో జావో యుజువాన్ (చైనా) రజతం, సన్ ఫురోంగ్ (చైనా) కాంస్యం గెలిచారు. తాజా విజయంతో సంధ్య 2019లోనే మెక్సికోలో జరిగే ప్రపంచ అమెచ్యూర్ చాంపియన్ షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా అమెచ్యూర్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : గోలి సంధ్య
ఎక్కడ : థాయ్‌లాండ్
#Tags