ఐఎస్‌బీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

కరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడంతోపాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
దీనికి సంబంధించి ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో ఆగస్టు 5న ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సమక్షంలో ఏపీ ఈడీబీసీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐఎస్‌బీ డీన్‌ ప్రొఫెసర్‌ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలు చేయడం ద్వారా వర్చువల్‌ ఒప్పందం జరిగింది.

పబ్లిక్‌ పాలసీ ల్యాబ్‌ ఏర్పాటు...
- ఏపీని అభివృద్ధి పథంవైపు నడిపేందుకు ఐఎస్‌బీతో కలిసి ‘పబ్లిక్‌ పాలసీ ల్యాబ్‌’ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు.
- ఐఎస్‌బీ ఒప్పందంతో పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాలవలవన్‌ తెలిపారు.

చదవండి: మూడు ప్రముఖ‌ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
https://www.sakshieducation.com/CurrentAffairs-TE/StoryT.aspx?cid=1&sid=298&chid=1621&tid=754&nid=272101

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు :రిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు
#Tags