2021–22 పంట ఏడాదికి వరి కనీస మద్దతు ధర ఎంత?

2021–22 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి వివిధ పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంపు ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 9న ఈ కమిటీ సమావేశమైంది.

రైతులకు సహేతుకంగా, న్యాయమైన రీతిలో గిట్టుబాటు ధర లభించేలా 2018–19 కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. కేబినెట్‌ కమిటీ నిర్ణయం ప్రకారం.. పంటల కనీస మద్దతు ధర వివరాలు ఇలా... వరి ధాన్యం కామన్‌ గ్రేడ్‌ ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1,868 ఉండగా రూ.72 పెంచుతూ... రూ. 1,940గా నిర్ధారించింది.ఈ ధాన్యం ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ. 1,293గా అంచనా వేసింది. వరి ధాన్యం గ్రేడ్‌ ఏ రకం ప్రస్తుతం క్వింటాల్‌కు రూ. 1,888 ఉండగా రూ.72 పెంచుతూ రూ.1,960గా ఖరారు చేసింది.

పంట

ఎమ్మెస్పీ (రూ.)

పెంపు(రూ.)

వరి(కామన్‌)

1,940

72

వరి (ఏ)

1,960

72

జొన్న(హైబ్రిడ్‌)

2,738

118

జొన్న(మల్దండి)

2,758

118

సజ్జలు

2,250

100

రాగి

3,377

100

మొక్కజొన్న

1,870

20

కందులు

6,300

300

పెసర

7,275

79

మినుములు

6,300

300

వేరుశనగ

5,550

275

పొద్దుతిరుగుడు

6,015

130

నువ్వులు

7,307

452

ఒడిసలు(నైగర్‌సీడ్‌)

6,930

235

పత్తి (మీడియం స్టేపుల్‌)

5,726

211

పత్తి(లాంగ్‌ స్టేపుల్‌)

6,025

200


క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 2021–22 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి వివిధ పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంపు
ఎప్పుడు : జూన్ 9
ఎవరు :కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ
ఎందుకు:రైతులకు సహేతుకంగా, న్యాయమైన రీతిలో గిట్టుబాటు ధర లభించాలని..





#Tags