2020 సంవత్సరానికీ అత్యంత విలువైన భారత బ్రాండు?
2020 సంవత్సరానికీ అత్యంత విలువైన భారత బ్రాండుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాండ్ నిలిచింది.
ఈ విషయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకటనల కంపెనీ అయిన డబ్ల్యూపీపీ తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాండ్ విలువ 11 శాతం తగ్గి 20.26 బిలియన్ డాలర్లకు పడిపోయినప్పటికీ.. 2020 ఏడాదికి అత్యంత విలువైన భారత బ్రాండుగా తన స్థానాన్ని నిలబెట్టుకుందని పేర్కొంది.
డబ్ల్యూపీపీ వివరాల ప్రకారం...
డబ్ల్యూపీపీ వివరాల ప్రకారం...
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తర్వాత ఎల్‌ఐసీ 18.29 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. ఎల్‌ఐసీ బ్రాండ్ విలువ సైతం 9 శాతం వరకు తగ్గింది.
- ఎయిర్‌టెల్ బ్రాండ్ విలువ 36 శాతం పెరిగి 13.94 బిలియన్ డాలర్లకు చేరింది. జాబితాలో ఈ బ్రాండ్‌కు నాలుగో స్థానం లభించింది.
- జియో బ్రాండ్‌కు ఏడో స్థానం లభించింది. బ్రాండ్ విలువ 26 శాతం పెరిగి 6.87 బిలియన్ డాలర్లకు చేరింది.
6 శాతం తగ్గిపోయి...
దేశంలోని అగ్రస్థాయి 75 బ్రాండ్ల విలువ 2020లో ఇప్పటి వరకు 6 శాతం తగ్గిపోయి 216 బిలియన్ డాలర్లుగా ఉందని డబ్ల్యూపీపీ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి పథంలోకి రానంత వరకు పరిస్థితులు అంత సజావుగా ఉండవని డబ్ల్యూపీపీ గ్రూపులో భాగమైన డేటా, కన్సల్టింగ్ కంపెనీ కాంటర్ ఇన్‌సైట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రీతిరెడ్డి తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 సంవత్సరానికీ అత్యంత విలువైన భారత బ్రాండుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : డబ్ల్యూపీపీ గ్రూపులో భాగమైన డేటా, కన్సల్టింగ్ కంపెనీ కాంటర్ ఇన్‌సైట్స్
#Tags