General of Indian Army: నేపాల్‌ సైన్యాధిపతికి మన సైన్యంలో గౌరవ హోదా

నేపాల్‌ ప్రధాన సైన్యాధికారి జనరల్‌ అశోక్‌ రాజ్‌ సిగ్డెల్‌కు డిసెంబర్ 12వ తేదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘భారత సైన్యంలో గౌరవ జనరల్‌’ హోదాను ప్రదానం చేశారు.

గత నెలలో, భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేదిని ‘నేపాల్‌ సైన్యంలో గౌరవ జనరల్‌’ హోదాతో నేపాల్‌ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ సత్కరించారు. 

1950 నుంచి భారత్‌, నేపాల్‌ దేశాలు తమ ప్రధాన సైన్యాధికారులను పరస్పరం గౌరవిస్తున్నాయి. సైన్యాధికారిగా అసమాన ప్రావీణ్యం చూపించి, భారత్‌-నేపాల్‌ బంధాన్ని మరింత బలపరిచేందుకు జనరల్‌ సిగ్డెల్‌ చేసిన కృషిని రాష్ట్రపతి ప్రశంసించారు. 

అదే రోజు భారత్‌లో పర్యటిస్తున్న సిగ్డెల్ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

National Award: చిల్లపల్లి గ్రామపంచాయతీకి జాతీయ పురస్కారం

#Tags