PM Modi, Bhutan King: ప్రధాని మోడీతో భూటాన్‌ రాజు ద్వైపాక్షిక భేటీ

రెండు రోజుల పర్యటనకు భారత్‌కు వచ్చిన భూటాన్ రాజు జిగ్మే ఖెసర్‌ నంగ్యేల్‌ వాంగ్చుక్‌తో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించారు. రెండు దేశాల మధ్య సహకారంలో ఇంధన రంగం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, టెక్నాలజీపై దృష్టి పెట్టాలని అంగీకారానికి వచ్చాయి.

భారత్, భూటాన్‌లు తమ మధ్య భాగస్వామ్యాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. థింపు ఆర్థిక ఉద్దీపన కార్యక్రమానికి తోడ్పాటునిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 

అలాగే.. వాంగ్చుక్ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. భారత్‌-భూటాన్‌ భాగస్వామ్యం సాధిస్తున్న స్థిరమైన పురోగతిపై భూటాన్ రాజుతో చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.

India and Guyana: భారత్, గయానా మధ్య బలమైన బంధం

#Tags