Swachh Survekshan Grameen Awards: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల్లో సిరిసిల్ల టాప్
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2023 అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే ఫోర్ స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానం దక్కింది.
జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన రహితం) ప్లస్ కేటగిరిలో మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దినందుకుగాను ఈ అవార్డు లభించింది. కేంద్ర తాగునీరు–పారిశుధ్య మంత్రిత్వ శాఖ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఓడీఎఫ్ ప్లస్ మోడల్ కింద అన్ని గ్రామాల్లోని ఇళ్లు, సంస్థలలో మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవడం, గ్రామాలలో తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్ట్ షెడ్ల వినియోగం, అన్ని గ్రామాలలో మురుగు నీటి నిర్వహణ, అన్నింటినీ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చి దిద్దడంతో పాటు ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ అవార్డును ప్రకటించారు.
Gandhi Mandela Award: దలైలామాకు గాంధీ–మండేలా అవార్డు
#Tags