Classical Dance Forms: గిన్నిస్ రికార్డ్‌.. ఎనిమిది శాస్త్రీయ నృత్య రూపాలు ఒకేసారి..!

కేరళలోని ఇరింజలకుడకు చెందిన 27 ఏళ్ల యువ కళాకారిణి అనఘశ్రీ సజీవనాథ్ భారతీయ శాస్త్రీయ నృత్య కళలలో విశేషమైన ఘనత సాధించింది.

అనఘశ్రీ ఒకే ప్రదర్శనలో ఎనిమిది భారతీయ శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ను నెలకొల్పింది. ఆమె కథాకళి, కూచిపూడి, సత్రియా, మణిపురి, ఒడిస్సీ, మోహినియాట్టం, భరతనాట్యం, కథక్ వంటి అన్ని ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్య కళలను ఒకే సమయంలో, కేవలం ఒక గంట 30 నిమిషాల్లో ప్రదర్శించి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో త‌న పేరును నిలుపుకుంది.

అన్ని భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలను అత్యధిక కాలం పాటు ప్రదర్శించి, రికార్డు సాధించిన ఘనత అనఘశ్రీ సొంతం చేసుకుంది. అనఘ చిన్నప్పటి నుంచే శాస్త్రీయ నృత్యం పట్ల ప్రగాఢ ఆసక్తిని ప్రదర్శించింది.

ఆమె మొదట మోహినియాట్టం నేర్చుకోగా, తరువాత వివిధ శాస్త్రీయ నృత్య రూపాలపై ఆసక్తి పెరిగింది. ఈ ప్రదర్శన ద్వారా అనఘ శాస్త్రీయ నృత్య కళలకు తన అంకితభావం, శిక్షణకు తగిన ప్రతిఫలాన్ని పొందింది. 

Marie Curie: రెండుసార్లు నోబెల్‌ బహుమతి పొందిన ఏకైక మహిళ.. ఆమె ఎవరంటే..

#Tags