C-TET Notification 2024 : సీబీఎస్‌ఈ డిసెంబ‌ర్ 2024కు సంబంధించి సీటెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) డిసెంబర్‌–2024 ఏడాదికి సంబంధించి సీటెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రతి ఏటా రెండుసార్లు సెంట్రల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌)ను సీబీఎస్‌ఈ నిర్వహిస్తుంది. 

»    అర్హత: పన్నెండో తరగతి, డిగ్రీ, డీఈఎల్‌ఈడీ/డీఈడీ(ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ(ప్రత్యేక విద్య), బీఈఎల్‌ఈడీ/బీఎస్సీఈడీ/బీఏఈడీ/బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    పరీక్ష విధానం: పరీక్షలో మొత్తం రెండు పేపర్‌లు ఉంటాయి. మొదటి పేపర్‌ ఒకటి నుంచి ఐదో తరగతులకు బోధించాలనుకునే ఉపాధ్యాయుల కోసం, రెండో పేపర్‌ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్‌ స్కోర్‌కు లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. పరీక్షను 
20 భాషల్లో నిర్వహిస్తారు. సీటెట్‌ స్కోర్‌ 
కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల 
ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణన లోకి తీసుకుంటారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.10.2024b
»    దరఖాస్తు సవరణ తేదీలు: 21.10.2024 నుంచి 25.10.2024 వరకు
»    పరీక్ష తేది: 01.12.2024.
»    తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌.
»    వెబ్‌సైట్‌: http://https//ctet.nic.in

Provisional Selection List: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల ప్రొవిజనల్‌ జాబితా విడుదల 

#Tags