Success Story : మా అమ్మ ఇచ్చిన ఆ డబ్బుతోనే.. కోట్లు సంపాదించానిలా.. కానీ..
ఇతని పేరు 'సంజీవ్ జునేజా' . తన తల్లి దగ్గర నుంచి కేవలం రూ.2000 తీసుకుని వ్యాపారం ప్రారంభించి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. నేడు ఈయన ఎంతో మందికి ఆదర్శప్రాయుడయ్యాడు. ఈ నేపథ్యంలో సంజీవ్ జునేజా సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
సంజీవ్ జునేజా.. అంబాలలో ఒక ప్రసిద్ధిచెందిన డాక్టర్ IK జునేజా కొడుకు. ఈయన ఒక చిన్న క్లినిక్ నడుపుతూ ఉండేవాడు. జునేజా తన తండ్రిని 1999లో కోల్పోయాడు. అప్పటికే సొంతంగా ఏదైనా చేయాలనే సంకల్పం ఉన్న ఇతడు తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి చనిపోక ముందే ఆయుర్వేదానికి సంబంధించిన కొన్ని మెళుకువలు నేర్చుకున్నాడు. తండ్రి మరణానంతరం ఇవన్నీ అతనికి ఉపయోగపడ్డాయి.
☛ Success Story : చదువులో ఫెయిలయ్యా.. కానీ రూ.1,843 కోట్లు సంపాదించానిలా.. ఎలా అంటే..?
అతి తక్కువ కాలంలోనే..
2003లో సంజీవ్ జునేజా రాయల్ క్యాప్సూల్స్‌తో తన కంపెనీని ప్రారంభించాడు. ఆ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి 2008లో హెయిర్ కేర్ ఫార్ములా స్టార్ట్ చేసాడు. ఇది అతి తక్కువ కాలంలోనే పాపులర్ బ్రాండ్‌గా ఎదిగింది. ఆ బ్రాండ్ పేరే 'కేశ్ కింగ్'. ఈ ఉత్పత్తులను ప్రారంభంలో ఇంటింటికి తిరిగి విక్రయించడం ప్రారంభించారు. ఆ తరువాత వార్తాపత్రికలు, న్యూస్ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టాడు. కేశ్ కింగ్ ప్రారంభమైన ఆనతి కాలంలోనే సుమారు రూ. 300 కోట్లు బ్రాండ్‌గా అవతరించింది. ఇమామి కేశ్ కింగ్ సంస్థను రూ.1651 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత పెట్ సఫా అనే మరో ఉత్పత్తిని తయారు చేశాడు. దీనికి రాజు శ్రీవాస్తవ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈయన డాక్టర్ ఆర్థోకి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.
ఒక చిన్న గదిని ఆఫీసుగా చేసుకుని..
సంజీవ్ జునేజా కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లో పరిచయం చేస్తూ ఎన్నో విజయాలను సాధించాడు. ప్రారంభంలో ఒక చిన్న గదిని ఆఫీసుగా చేసుకుని కేష్ కింగ్ హెయిర్ ఆయిల్ విక్రయాలతో నేడు రూప్ మంత్ర, పెట్ సఫా, డాక్టర్. ఆర్థో, సచి సహేలి, అక్యుమాస్, దంతమణి, మధుమణి, మోర్ పవర్, రాజ్సీ, తులసి మంత్రం అనే అనేక ఉత్పత్తులు ప్రారభించాడు. నేడు భారతదేశంలో గొప్ప వ్యాపార వేత్తగా మాత్రమే కాకుండా మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇప్పుడు ఆయన సంపాదన వేళా కోట్లకు చేరింది. సంజీవ్ జునేజా సక్సెస్ స్టోరీ నేటి యువతకు ఒక మంచి స్ఫూర్తినిస్తుంది.