కొత్తగా మరో 2,842 పోస్టులకు నోటిఫికేషన్..జిల్లా వారిగా పోస్టులు ఇవే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ నియామకాల పరంపర కొనసాగుతూనే ఉంది.

గడిచిన ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్కపోస్టుకూ నియామకం ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా భారీగా నియామకాలు చేసిన సర్కారు ఇప్పుడు కొత్తగా మరో 2,842 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో వివిధ పథకాల అమలుకు ఈ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్ తేదీలు.. పోస్టుల వివరాలు..

జిల్లా

నోటిఫికేషన్ తేదీ

పోస్టులు

దరఖాస్తుకు చివరి తేదీ

శ్రీకాకుళం

02.10.2020

229

10.10.2020

విజయనగరం

01.10.2020

217

10.10.2020

విశాఖపట్నం

01.10.2020

322

10.10.2020

తూ.గోదావరి

01.10.2020

326

10.10.2020

ప.గోదావరి

08.10.2020

159

14.10.2020

కృష్ణా

01.10.2020

171

10.10.2020

గుంటూరు

02.10.2020

160

12.10.2020

ప్రకాశం

06.10.2020

194

12.10.2020

నెల్లూరు

01.10.2020

76

10.10.2020

చిత్తూరు

01.10.2020

194

10.10.2020

వైఎస్సార్

01.10.2020

296

10.10.2020

కర్నూలు

03.10.2020

322

10.10.2020

అనంతపురం

03.10.2020

176

10.10.2020


ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలోనే..

  • పోస్టుల వివరాలన్నీ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఉంటాయి.
  • దరఖాస్తులు అక్కడే ఇస్తారు. దరఖాస్తుతో పాటు, ధ్రువపత్రాలు జతచేసి గడువులోగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇవ్వాలి.
  • నియామకం జరిగే పోస్టుల్లో సుమారు 30 కేటగిరీలకు పైనే ఉన్నాయి. ఎక్కువగా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా రకరకాల పోస్టులున్నాయి.
  • 2,842 పోస్టులు కాకుండా మరో 40 రాష్ట్ర స్థాయి పోస్టులను కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి భర్తీ చేస్తారు.
  • అర్హత, పోస్టుల వివరాలు వంటివన్నీ కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

పారదర్శకంగా నియామకాలు..
ఈ ప్రభుత్వం వచ్చాక వేలాది నియామకాలు జరిపాం. ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా పూర్తయింది. కొత్తగా నియామకాలు జరిగే వీటి విషయంలోనూ అంతే పారదర్శకంగా జరపాలని అధికారులను ఆదేశించాం. ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది.
- ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

పథకాల అమలు మరింత పటిష్టంగా..
కొత్తగా నియామకాల వల్ల మానవ వనరుల బలం పెరుగుతుంది. దీనివల్ల పథకాల అమలు పటిష్టంగా జరుగుతుంది. ఈ నెలాఖరుకు కొత్తగా ఎంపికై న వారు విధుల్లో చేరతారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మరింత మెరుగైన సేవలందేలా చేస్తాం.
- కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ

ఏపీ
అంగన్‌వాడీల్లో 5,905 పోస్టులు...పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి












#Tags