జూలై 5 నుంచి పాలిటెక్నిక్‌ డిప్లొమా ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు

సాక్షి,హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలను జూలై 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ తెలిపారు.
పార్ట్‌–ఏలో ఇచ్చే ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు కలిగిన 15 ప్రశ్నల్లో 12 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. పార్ట్‌–బీలో ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కలి గిన 9 ప్రశ్నలు ఉంటాయని, అందులో 6 ప్రశ్న లకు జవాబులు రాయాలన్నారు. పార్ట్‌–సీలో ఒక్కో ప్రశ్నకు 5 మార్కులు కలిగిన 9 ప్రశ్నలు ఇస్తామని, అందులో 6 ప్రశ్నలకు సమాధా నాలు రాయాలన్నారు. ఇలా ఒక్కో సబ్జెక్టులో 60 మార్కులకు పరీక్షలు ఉంటాయన్నారు.
#Tags