JNTU: జేఎన్‌టీయూని సందర్శించిన ఉప కులపతి..

జేఎన్‌టీయూని సందర్శించి అక్కడి సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న బోధన గురించి తెలుసుకున్నారు ఆయన. ఈ సందర్భంగా అక్కడి అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న జేఎన్‌టీయూ కళాశాలను శనివారం అనంతపురం జేఎన్‌టీయూ ఉప కులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భగా ఆయన అన్ని డిపార్ట్‌మెంట్ల వాళ్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ సెమినార్‌ హాలులో అధ్యాపక, అధ్యాపకేతర బృందంతో సమావేశమయ్యారు.

Digital Education: దివ్యాంగులకు డిజిటల్‌ బోధనతో విద్యాభివృద్ధి..

ఈ సమావేశంలో కళాశాల అభివృద్ధికి కావాల్సిన మార్గదర్శకాలను దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కళాశాల రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సి.శశిధర్‌, ఐక్యూఏసీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జి.వి.సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్‌ రమణారెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

#Tags