Gadela Bhupati: అంతరిక్ష పరిశోధకులుగా ఎదగాలి

కోరుట్ల: విద్యార్థులు అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఆకాంక్షించింది.

పట్టణంలోని కల్లూర్‌ రోడ్డులోగల బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు రాఖీ పౌర్ణమి సందర్భంగా భారీ రాఖీని తయారు చేసి ఇస్రో బృందానికి బహుమతిగా పంపించారు. ఈ మేరకు బృందం సభ్యులు స్పందించి రాఖీ తయరు చేసి పంపించిన విద్యార్థులు, ఉపాధ్యాయబృందాన్ని అభినందిస్తూ పోస్టు ద్వారా పార్సిల్‌ పంపించారు.

చదవండి: Inspiring Success Story : గెట్ లాస్ట్ అన్న చోటే.. చైర్మన్ అయ్యాను.. కానీ..

ఇందులో డైరీ, చంద్రయాన్‌–3 ల్యాండింగ్‌ చిత్రాలు, ఇస్రో పరిశోధన కరపత్రాలు ఉన్నాయని ప్రధానోపాధ్యాయుడు గడెల భూపతి తెలిపారు. పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎంఈఓ గంగుల నరేశం ఉపాధ్యాయులు, విదార్థుల కృషిని ప్రశంసించారు. సైన్స్‌ ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, నాగరాజు, విద్యార్థులు మనుజ్యోతి, ఇందు ప్రియ, నందిని, రమణి, ఉషశ్రీ పాల్గొన్నారు.

#Tags