Job Mela: జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోండి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: వివిధ ప్రైవేట్‌ సంస్థల్లో 150 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అక్టోబ‌ర్ 7న జాబ్‌మేళా నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి మహమ్మద్‌ జానీపాషా ఒక ప్రకటనలో తెలిపారు.
జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోండి

జడ్చర్లలోని విర్చో పెట్రోకెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మైక్రో బయాలజిస్ట్‌ అండ్‌ కెమికల్‌గా పనిచేసేందుకు బీఎస్సీ, ఎమ్మెస్సీ లైఫ్‌ సైన్సెస్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, భారత్‌ పే క్యూఆర్‌ కోడ్స్‌ సంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేసేందుకు ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు. అలాగే జగతి పబ్లికేషన్స్‌లో మార్కెటింగ్‌ అండ్‌ టీం కో–ఆర్డినేషన్‌గా పనిచేసేందుకు పదోతరగతి, ఇంటర్మీడియెట్‌ ఆపై చదివిన వారు అర్హులని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబ‌ర్ 7న‌ ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్‌ పిల్లలమర్రి రోడ్‌లోని జిల్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

చదవండి: Indian Army Notification 2023: ఇండియన్‌ ఆర్మీలో 139వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు

18 నుంచి 28 ఏళ్ల లోపు వారు అర్హులని, తప్పక ఆధార్‌కార్డు, బయో–డేటా ఫారం వెంట తెచ్చుకోవాలని, ఎంపికై న వారు ఆయా పోస్టుల వారీగా నెలకు రూ.11 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఇస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఫోన్‌ నం.95502 05227, 99485 68830, 99126 05508లలో సంప్రదించవచ్చని తెలిపారు.
 

#Tags