Degree Courses: డిగ్రీ కోర్సుల గడువు విద్యార్థుల ఇష్టం.. పెంచుకోవచ్చు.. తగ్గించుకోవచ్చు
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు నిర్ధిష్ట గడువు ఉంటుంది. డిగ్రీ కోర్సులు సాధారణంగా మూడేళ్లలో పూర్తవుతాయి.
తమ వెసులుబాటును బట్టి కోర్సుల గడువును తగ్గించుకొనే లేదా పెంచుకొనే అవకాశం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఇలాంటి ఐచ్ఛికాన్ని విద్యార్థులకు ఇవ్వడానికి వీలుగా ఉన్నత విద్యా సంస్థలకు అనుమతి మంజూరు చేయబోతున్నట్లు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) చైర్మన్ జగదీష్ కుమార్ చెప్పారు.
యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఏడీపీ), ఎక్స్‌టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఈడీపీ)ను ఆఫర్ చేసే విషయంలో ప్రామాణిక నియమావళికి యూజీసీ ఇటీవల ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రజల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానించనున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ప్రామాణికమైన గడువు కంటే తక్కువ వ్యవధిలో లేదా ఎక్కువ వ్యవధిలో పూర్తి చేసినప్పటికీ ఆయా డిగ్రీలను సాధారణ డిగ్రీలుగానే పరిగణిస్తారు. ఉన్నత చదువులు లేదా ఉద్యోగ నియామకాలకు అవి యథాతథంగా చెల్లుబాటు అవుతాయి.
#Tags