Life Sciences: లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ టాప్‌

మాదాపూర్‌ (హైదరాబాద్‌): ప్రపంచ ఔషధ ఉత్ప త్తిలో భారత్‌ వాటా 35 శాతంగా ఉందని, రానున్న రోజులలో 50 శాతానికి పెరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

మాదాపూర్‌లోని హైటెక్స్‌లో సెప్టెంబ‌ర్ 26న‌ అనలిటికా అనకాన్‌ ఇండియా, ఇండియా ల్యాబ్‌ ఎక్స్‌పో, ఫార్మాప్రో ప్యాక్‌ ఎక్స్‌పో–2024ను నిర్వాహకులతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ఫార్మా ఉత్పత్తుల రంగంలో, ఫార్మా సంబంధిత పరిశోధన, రూపకల్పనలో భారతదేశం ప్రాధాన్యతను కలిగిఉందన్నారు.

చదవండి: Drugs Fail Quality: పారాసెటమాల్‌తో సహా.. 53 ఔషధాల్లో నాణ్యతా లోపాలు!!

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ఫార్మస్యూటికల్స్, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు మంచి వనరులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని పేర్కొ న్నారు.  మన దేశంలోని సంస్థలు ప్రపంచ దేశాలతో పోటీపడేలా, స్వతహాగా సంస్థలు అభివృద్ధి చెందేలా వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.

ఈ ఎగ్జిబిషన్‌లో 500లకు పైగా ఎగ్జిబిటర్లు, 7 వేలకు పైగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్టు మెస్సె మూంచెస్‌ ఇండియా సీఈఓ భూపిందర్‌సింగ్‌ తెలిపారు.  

#Tags