Telangana Schools Reopen: స్కూల్స్ రీ ఓపెన్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏమ‌న్నారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణలో వేసవి సెలవుల పొడగింపుపై తల్లిదండ్రుల్లో కాస్త అయోమయం, కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నెలకొంది.
Sabitha Indra Reddy, Telangana Education Minister

అయితే పొడగింపు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని, యథాతథంగా స్కూల్స్‌ తెరుచుకుంటాయని తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది. ఈ తరుణంలో ఇవాళ మరోసారి ప్రకటన చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.సెలవుల పొడిగింపు లేదని జూన్ 12వ తేదీన(ఆదివారం) మీడియాకు తెలిపిన ఆమె.. రేపటి నుంచి(జూన్‌ 13, సోమవారం) స్కూళ్లు రీ ఓపెన్‌ అవుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అయోమయానికి గురికావొద్దని చెప్పారామె. 

పదో తరగతి మోడల్ పేపర్లు

పదో తరగతి ప్రివియస్‌ పేపర్స్

పదో తరగతి స్డడీ మెటీరియల్‌

ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్‌ మీడియం..
ఈ ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు ఆమె. అదే విధంగా ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. 

Govt schools: ఇంగ్లిష్‌ మీడియంపై విద్యార్థుల్లో ఆసక్తి..

సెలవులు పొడగించే ప్రసక్తే లేదు..
తెలంగాణలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున పాఠశాలలకు సెలవులకు పొడగింపులు ఉండొచ్చనే కథనాలు జోరందుకున్నాయి. అయితే అలాంటిదేం ఉండబోదని విద్యాశాఖ ఆ వెంటనే స్పష్టత ఇచ్చేసింది. కరోనా కేసుల పరిస్థితి అదుపులోనే ఉన్నందున.. సెలవులు పొడగించే ప్రసక్తే లేదని  తేల్చి చెప్పింది. కరోనా జాగ్రత్తలతో పాఠశాలలు నడిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.

పదో తరగతి బిట్‌బ్యాంక్

పదో తరగతి సిలబస్

పదో తరగతి టెక్స్ట్ బుక్స్

మోడల్ పేపర్లు కోసం క్లిక్ చేయండి

Gurukul admissions: గురుకులాల్లో స్థానికులకే సగం సీట్లు

#Tags