Food Quality: ఆహార నాణ్యతపై టాస్క్‌ఫోర్స్!.. ఫుడ్ కమిటీలు, పర్యవేక్షక అధికారి మార్గదర్శకాలు జారీ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మొదలు... సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందించే ఆహారం నాణ్యతపై నిఘా, పర్యవేక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఎస్సీ అభివృద్ధి శాఖతోపాటు గిరిజన, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలు, వైద్యారోగ్య శాఖ పరిధి లోకి వచ్చే అన్ని విద్యా సంస్థల్లో అందించే ఆహా రం నాణ్యతను పర్యవేక్షించే బాధ్యతను ఈ కమి టీకి అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: Food Safety in Schools: ఇక ఫొటోలు తీసి.. వీరు తిన్నాకే.. పిల్లలకు వడ్డించాలి!
కమిటీలో సభ్యులుగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ లేదా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సంబంధిత విద్యా సంస్థ ఉన్నతాధికారి/ అదనపు సంచాలకుడు, విద్యా సంస్థ జిల్లా స్థాయి అధికారి (డీఎస్‌డబ్ల్యూఓ/ డీటీడబ్ల్యూఓ/డీబీసీడబ్ల్యూఓ/ డీఈఓ) తదితరులుంటారు.
ఈ కమిటీ నిర్దేశించిన విద్యా సంస్థలను సందర్శించి ఆహార భద్రత చర్యల ను పరి శీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏదైనా సంస్థలో లోటుపాట్లను గుర్తిస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు బాధ్యులపై చర్యల కోసం సిఫార్సు చేయాలని సూచించింది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
విద్యా సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు, పర్యవేక్షక అధికారి
టాస్క్‌ఫోర్స్ మాత్రమేకాకుండా విద్యా సంస్థల స్థాయిలో ఫుడ్ సేఫ్టీ కమిటీలను, పర్యవేక్షక అధికారిని సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి సంబంధించిన మార్గదర్శ కాలను జారీ చేసింది. విద్యా సంస్థల్లో మెరుగైన, బలవర్థకమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. కలుషిత ఆహారంతో కలిగే అనా రోగ్య సమస్యలు, తదుపరి పరిణామాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిటీలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
- ఫుడ్ సేఫ్టీ కమిటీలో విద్యా సంస్థ ప్రధానోపాద్యాయుడు/ ప్రిన్సిపల్/ వార్డెన్‌తోపాటు మరో ఇద్దరు సిబ్బంది సభ్యులుగా ఉంటారు.
- ఈ కమిటీ సభ్యులు ప్రతిరోజు భోజనం తయారు చేసే ముందు స్టోర్ రూమ్, వంట గదిని తనిఖీ చేయాలి. తర్వాత వంటగది నిబంధనలకు అనుగుణంగా నాణ్యత, ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధారించాలి.
- వంట వండిన తర్వాత ఆహార నాణ్యతను కమిటీ సభ్యులు రుచి చూసి పరిశీలించిన తర్వాతే విద్యార్థు లకు అందించాలి. ప్రతిరోజు ఈ బాధ్యతలను విధిగా పూర్తి చేయాలి.
- త్వరలో నోడల్ డిపార్టుమెంట్ యాప్‌ను తయారు చేస్తుంది. అప్పటి నుంచి తనిఖీలకు సంబంధించిన ఫోటోలను, ఇతర సమాచా రాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ఇక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి విద్యాసంస్థకు ప్రత్యేకంగా ఒక పర్యవేక్షక అధికారికి నియమి స్తారు. ఈ పర్యవేక్షక అధికారి ప్రతిరోజు భోజనం వండే ముందు, తర్వాత తనిఖీ చేస్తారు. అక్కడి పరిస్థితిని చిత్రాలు తీసి జిల్లా కలెక్టర్/ సంబంధిత ఉన్నతాధికారికి సమర్పిస్తారు.
- వీటన్నింటికి సంబంధించి తక్షణమే చర్యలు తీసు కోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం
మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మల్హర్ మండలం మల్లారం కస్తూర్భా గాంధీ పాఠశాలను గురువారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. బియ్యం, నిత్యావసర సరకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి అల్పాహారం, భోజన సదుపాయాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో ఆహార నాణ్యత పరిశీలనకు ప్రతీ శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.