NAS Exam: జిల్లా విద్యార్థులు సత్తా చాటాలి
ఆసిఫాబాద్ రూరల్: నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే(న్యాస్)లో జిల్లా విద్యార్థులు సత్తా చాటాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సెప్టెంబర్ 12న ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ న్యాస్‌లో జిల్లాను మొదటిస్థానంలో నిలపాలన్నారు.
కేంద్ర విద్యా, మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో భాగంగా 3, 6, 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు. ర్యాండమైజేషన్ ప్రకారం జిల్లాలోని 10 పాఠశాలలను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
ఇందులో నాలుగు మాక్ టెస్టులు, ఏడు వారాంతపు పరీక్షలు ఉంటాయన్నారు. గణితం, సైన్స్ సబ్జెక్టులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. సమావేశంలో ఎస్‌వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
#Tags