Skills University: ‘స్కిల్స్‌’ తొలి నోటిఫికేషన్‌.. మొదటి విడతలో నాలుగు కోర్సులు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: స్కిల్స్‌ యూనివర్సిటీలో లాజిస్టిక్స్, మెడికల్‌ అండ్‌ హెల్త్, ఫార్మా రంగాల్లో అత్యధిక ఉద్యోగాల డిమాండ్‌ ఉన్న 4 కోర్సులను ప్రారంభించనున్నారు.

దసరా సెలవుల తర్వాత ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్లు, అర్హతల పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ వెలువడనుంది. త్వరలోనే మరిన్ని కోర్సులనూ ప్రారంభించేందుకు స్కిల్స్‌ వర్సిటీ వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ వీఎల్వీఎస్‌ఎస్‌.సుబ్బారావు తెలిపారు.

చదవండి: National Film Awards: 70వ నేషనల్ సినీ అవార్డ్స్.. ఎవరెవరికి అవార్డులు వ‌చ్చాయంటే?

ఆయా రంగాల్లో పేరొందిన కంపెనీలు, సంస్థల భాగస్వామ్యంతో ఈ కోర్సులకు అవసరమైన సిలబస్‌ రూపకల్పన చేస్తున్నారు. ఆయా రంగాల్లో నిపుణులతో విద్యార్థులకు బోధనా తరగతులతోపాటు ప్రాక్టికల్స్‌ కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌ సిటీలో 57 ఎకరాల విస్తీర్ణంలో ఈ వర్సిటీ భవనాలకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది గచ్చిబౌలిలో ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో తాత్కాలికంగా వర్సిటీ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. 

ఆయా కోర్సులు ఇలా...

  • తాత్కాలిక క్యాంపస్‌లో లాజిస్టిక్స్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు ప్రముఖ గ్లోబల్‌ లాజిస్టిక్స్‌ సొల్యూ షన్స్‌ కంపెనీ రెడింగ్టన్‌ ముందుకొచ్చింది. రూ.7 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సిద్ధపడింది. లాజిస్టిక్స్‌ రంగానికి సంబంధించి రెండు షార్ట్‌ టర్మ్‌ కోర్సులను వర్సిటీ ప్రారంభించనుంది. వీటి నిర్వహణకు లాజిస్టిక్స్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ సహకారం అందిస్తోంది. 
  • నర్సులకు ఉన్నత ఉపాధి అవకాశాల కల్పనకు ఫినిషింగ్‌ స్కిల్స్‌ ఇన్‌ నర్సింగ్‌ ఎక్సలెన్స్‌ (ఫైన్‌) కోర్సును ఈ ఏడాదే  ప్రారంభిస్తారు.
  • డాక్టర్‌ రెడ్డీస్‌ ఫార్మా అసోసియేట్‌ పేరుతో అ ప్రెంటిస్‌షిప్‌ ఇండక్షన్‌ కోర్సును ఈ ఏడాది ప్రారంభిస్తారు. ఈ కోర్సు వ్యవధి 6 నెలలు.  
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులలో చేరిన విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ గ్యారంటీగా వస్తుందని వీసీ సుబ్బారావు అభిప్రాయపడ్డారు. శిక్షణ అందుకున్న విద్యార్థులకు నెలకు రూ.20 వేల నుంచి రూ. 25 వేల వేతనం ఉండే ఉద్యోగాల్లో చేరే అవకాశాలుంటాయని తెలిపారు. 

#Tags