Skill Training: నైపుణ్య శిక్షణ.. ఉపాధికి నిచ్చెన

కరీంనగర్‌ కల్చరల్‌: విద్యాశాఖ ఆధ్వర్యంలో టెక్నికల్‌ టీచర్‌ సర్టిఫికెట్‌ (టీటీసీ) కోర్సులో భాగంగా డ్రాయింగ్‌, మ్యూజిక్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ వంటి కోర్సుల్లో నిపుణులైన శిక్షకుల ప్రత్యేక పర్యవేక్షణలో శిక్షణ తీసుకొని వారి జీవనోపాధికి మార్గం చూసుకుంటున్నారు పలువురు అభ్యర్థులు.

డ్రాయింగ్‌లో స్టోన్‌, వాల్‌, వుడ్‌ పెయింటింగ్‌లో మెలకువలు నేర్చుకుంటూ.. టైలరింగ్‌లో మంచి నైపుణ్యాలు సాధిస్తూ.. ఎంబ్రాయిడరీలో పనికి రాని వస్తువులతో పలు అందమైన ఆకృతులను తయారు చేస్తున్నారు. కరీంనగర్‌లోని ధన్గర్‌వాడీ ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో టీటీసీ (టెక్నికల్‌ టీచర్‌ సర్టిఫికెట్‌) కోర్సు నేర్చుకుంటున్నారు.

మే 1న ప్రారంభమైన శిక్షణ జూన్ 13 వరకు కొనసాగుతుంది. శిక్షణ అనంతరం వీరికి జూలై లేదా ఆగస్టులో రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కేజీబీవీ, గురుకులంలో వృత్తి విద్యా కోర్సులో టీటీసీ పూర్తి చేసిన వారు కాంట్రాక్ట్‌, ప్రభుత్వ ఉద్యోగులకు అర్హులు.

చదవండి: Skill Development: యువతలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపెంపొందించడమే లక్ష్యంగా..

ఈ కోర్సులో శిక్షణ పొందుతున్న వారిలో 85శాతం మంది మహిళలు ఉన్నారు. 14 జిల్లాల నుంచి 590 మంది శిక్షణ పొందుతుండగా.. అందులో టైలరింగ్‌లో 313 మంది, డ్రాయింగ్‌లో 267 మంది, మ్యాజిక్‌లో 10 మంది తర్పీదు పొందుతున్నారు. శిక్షణ పొందుతున్న పలువురిని ‘సాక్షి’ పలకరించగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.

పిల్లలకు ఎలా నేర్పించాలో తెలిసింది

ఇక్కడకి రాక ముందు డ్రాయింగ్‌లో బేసిక్స్‌ మా త్రమే తెలిసింది. టీచర్ల పర్యవేక్షణలో మంచి మెలకువలు నేర్చుకున్న. పెయింటింగ్స్‌ ఎలా వేయాలో తెలిసింది. పిల్లలకు ఎలా నేర్పించాలో చెప్పారు. వుడ్‌, స్టోన్‌, ప్రకృతి, స్పెషల్‌ వర్క్‌ వాటిలో నైపుణ్యం సాధించా. ఎంత ఓపిక ఉంటే అంత బాగా నేర్చుకోవచ్చనే విషయం తెలిసింది.

– జె.మేఘన, గోదావరిఖని

టైలరింగ్‌లో మెలకువలు నేర్చుకున్న

టైలరింగ్‌, ఎంబ్రాడయిరీలలో అన్ని రకాల మెలవకులు నేర్చుకున్న. పిల్లలకు ఎలా చెప్పాలో వివరంగా నేర్పించారు. మాస్టర్‌ చాలా ఓపికతో ప్రతీ విషయాన్ని అర్థమయ్యేలా బోధించారు. శిక్షణ శిబిరం మాకు ఎంతో ఉపయోగపడింది. మా జీవనోపాధికి మార్గం ఏర్పడింది.

– లావణ్య, మంచిర్యాల

అవగాహన వచ్చింది

టైలరింగ్‌, ఎంబ్రాయిడరీలో శిక్షణ తీసుకున్న. ఎంబ్రాయిడరీలో మంచి అవగాహన వచ్చింది. ఇక్కడ నేర్పించిన విధానం బాగుంది. మాకు ఒక జీవోనోపాఽధి మార్గం దొరికింది. చాలో సంతోషంగా ఉంది.

– వేముల శ్రీలత, వేములవాడ

కర్ణాటక సంగీతంలో శిక్షణ

నేను ప్రోగ్రామింగ్‌ ఆర్టి స్ట్‌. ఇక్కడ కర్ణాటక సంగీతంలో శిక్షణ తీ సుకున్న. పాటలు పా డుతా. మ్యూజిక్‌ ఒక హాబి. సివిల్స్‌ ప్రిపరేషన్‌లో ఉన్నా. ఒకవేళ అది కుదరకుంటే మ్యూజిక్‌ టీచర్‌ వృత్తి చేపట్టాలని కోరిక. అందుకే ఇక్క డ శిక్షణ తీసుకున్నా.

– రాఘవ, హైదరాబాద్‌

క్రమశిక్షణతో తర్ఫీదు

734 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 590 మంది శిక్షణకు హాజరయ్యారు. శిక్షణతో తమ జీవితాల ను తామే బాగుచేసుకునే చక్కటి అవకాశం వారికి లభించింది. క్రమశిక్షణతో శిక్షణ ఇస్తున్నాం. అందరూ డెమోలు పూర్తి చేశారు.

– జి. ప్రమోద, కోర్సు డైరెక్టర్‌

#Tags