School Holidays: ఎల్లుండి తెలంగాణలో స్కూళ్ల బంద్‌!.. కార‌ణం ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని పాఠశాలల్లో జరుగుతున్న వరుస పుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్‌ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి న‌వంబ‌ర్‌ 30న ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది.

రాష్ట్రంలో వరుసగా పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. రక్షణ కరువై, పర్యవేక్షణ లేకుండా పోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కీలకమైన విద్యారంగానికి మంత్రి లేకుండానే ఏడాది గడిచిందన్నారు. ఈ సమస్యలపై కనీసం సమీక్ష చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు.

చదవండి: Quality Food: విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే వేటే: సీఎం రేవంత్‌

అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30న ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. తక్షణమే వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ అధికారులు సమీక్షించి, సమస్యలు పరిష్కారించాలని ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేసింది. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags