Sakshi Spell Bee: స్పెల్‌బీపై ఆసక్తితో..

స్పెల్‌బీపై ఆసక్తితో..

సాక్షి స్పెల్‌బీని ఎంతో ఆసక్తితో రాస్తున్నాను. కఠినమైన ఇంగ్లిష్‌ వర్డ్స్‌కు స్పెల్లింగులు రాయడం బాగుంది. స్పెల్‌బీపై ఇంట్రెస్ట్‌ పెరిగింది. ఇంగ్లిష్‌ గ్రామర్‌ ప్రాధాన్యం తెలిసింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్పెల్‌బీకి హాజరయ్యాను. ఇకపైనా ఇలాగే రాస్తాను.
– జె.విశ్వరూప, 9వ తరగతి, కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌

ఇంగ్లిష్‌పై పట్టుకు దోహదం

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌పై పట్టు సాధించేందుకు స్పెల్‌బీ దోహదం చేస్తుంది. ప్రశ్నపత్రం ఇచ్చిన విధానం బాగుంది. పాఠశాలలో చదివే పాఠ్యాంశాలు, సిలబస్‌ నుంచే ఇవ్వడంతోపాటు కఠిన పదాలకు స్పెల్లింగులు రాయడం ఎంతో ఆసక్తిగా ఉంది. వకాబులరీలో అర్థాలు తెలుసుకునేందుకు అవకాశం కలిగింది.
– ఎస్‌.సాయిచరణ్‌, 8వ తరగతి, కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌

తొలిసారి రాస్తున్నా

సాక్షి స్పెల్‌బీ రాయడం ఇదే తొలిసారి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో కఠిన పదాలకు స్పెల్లింగులు రాయడం బాగుంది. క్లాస్‌రూమ్‌లో టీచర్‌ చెప్పిన విషయాలతోపాటు ఎన్నో కొత్త వర్డ్స్‌ ఉన్నాయి. వాటికి అర్థాలను తెలుసుకుని, రాయడం చాలా బాగుంది.
– గగనా, 4వ తరగతి, కెనడీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌

ఇంగ్లిష్‌పై ఆసక్తి పెరుగుతోంది

నాకు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అంటే ఇష్టం, ఇంగ్లిష్‌లో ప్రతి ఒక్క వర్డ్‌కు అర్థమయ్యేలా చెప్పి, స్పెల్లింగ్‌ రాయించే విధానం నచ్చింది. టెక్ట్స్‌ బుక్‌లో నుంచి పాఠాల నుంచి మా టీచర్‌ చెబుతున్న విషయాలతోపాటు కొత్త వర్డ్స్‌ తెలుసుకున్నాను.
– మనీష్‌, 5వ తరగతి, కెనడీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌

#Tags