హెచ్‌సీయూ ప్రొఫెసర్లకు అరుదైన అవకాశం
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని ఇద్దరు ప్రొఫెసర్లకు అరుదైన అవకాశం లభించింది.
హెచ్‌సీయూలోని ప్రొఫెసర్ ఏఎస్ రాఘవేంద్ర, ప్రొఫెసర్ పి.ప్రకాశ్‌బాబు యూకే లోని రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ (ఎఫ్‌ఆర్‌ఎస్‌బీ) సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రొఫెసర్ ఏఎస్ రాఘవేంద్ర ప్రస్తుతం స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ) రీసెర్చ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
చదవండి: 2 రకాలుగా హెచ్‌సీయూ ఎంబీఏ అడ్మిషన్లు
ప్రొఫెసర్ పి.ప్రకాశ్‌బాబు స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. జీవశాస్త్రంలో పరిశోధనలకు గాను వీరికి ఈ గుర్తింపు లభించింది.
#Tags