Oxford Dictionary: 12 భారతీయ భాషల్లో ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు.. అవి ఇవే..

సాక్షి, అమరావతి: ఆంగ్ల భాషపై పట్టు సాధించాలనుకునేవారికి ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు ఎంతో ఉప యోగపడుతుందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ఇండియా ఎండీ సుమంతా దత్తా తెలిపారు.
12 భారతీయ భాషల్లో ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు.. అవి ఇవే..

ప్రస్తుతం తమిళం, కన్నడ, ఒరియాతో సహా 12 భారతీయ భాషల్లో నిఘంటువులను ప్రచురిస్తున్నట్టు తెలిపారు. ఏపీలోని పాఠ శాల విద్యార్థులకు ద్విభాషా నిఘంటువులను ఉప­యోగించి ఆంగ్లాన్ని బోధించే కొత్త, వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నారని, జగనన్న విద్యా కానుక కింద అందించే కిట్లలో నాలుగో ఏడాది కూడా తమ డిక్షనరీలను తీసుకున్నట్టు తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు పిక్టోరియల్‌ డిక్షనరీలు, 6–10వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులు వీటిలో ఉన్నాయని తెలిపారు. 

చదవండి: 

ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో 26 నూతన భారతీయ పదాలు

ఆక్స్‌ఫర్డ్ హిందీ పదంగా నారీ శక్తి

#Tags