Osmania University: పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదల

ఓయూ పరిధిలోని వివిధ రకాల కోర్సుల పరీక్షా తేదీలను అధికారులు ప్రకటించారు.

 ఈ మేరకు యూనివర్సిటీ పరిధిలోని బీఏ (ఓరియంటల్ లాంగ్వెజెస్) పరీక్షా తేదీలను ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఇవాళ వెల్లడించారు.

ఈ మేరకు కోర్సులను అనుసరించి మొదటి, మూడు, 5వ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

చదవండి: Telangana Universities Jobs 2024 : తెలంగాణ‌లోని యూనివర్సిటీల్లో 1,977 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

మూడేళ్ల పాటు ఉండే ఎల్‌ఎల్‌బీ, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌ కోర్సుల రెండు, మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌, ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల బీబీఏ ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలను జ‌నవ‌రి 23 నుంచి, ఎల్‌ఎల్‌ఎం మూడో సెమిస్టర్‌ పరీక్షలను జ‌నవ‌రి 27న నుంచి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి ఎగ్జామ్ షెడ్యూల్ వివరాలకు పరిశీలించేందుకు గాను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in సంప్రదించాలని అధికారులు సూచించారు.

#Tags